మాంచెస్ట‌ర్ T20:  ఇంగ్లండ్‌పై భార‌త్ ఘన విజయం

t20మాంచెస్టర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో భార‌త్ విజ‌యం సాధించింది. టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో  మొదట  బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. దీంతో 160 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన 18.2 ఓవ‌ర్లకు కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 163 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. దీంతో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భార‌త్ విజ‌యం సాధించింది.

రాహుల్ 54 బాల్స్ లో పది ఫోర్లు, ఐదు సిక్స్ లతో 101 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు. బౌండరీలతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు  చూపించాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ నాలుగు పరుగులు చేసి విల్లే బౌలింగ్ లో ఔటయ్యాడు. రోహిత్ శర్మ 32 పరుగులు చేసి మోర్గాన్ కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన కోహ్లీ, లోకేశ్ రాహుల్ నాటౌట్ గా నిలిచారు.

 

Posted in Uncategorized

Latest Updates