మాక్ డ్రిల్ లో విషాదం : రెండో అంతస్తు నుంచి తోసేశారు..

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్  కాలేజీ ఆఫ్  ఆర్ట్స్ అండ్  సైన్స్  కాలేజీలో మాక్ డ్రిల్ విషాదంగా మారింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై విద్యార్థులకు అవగాహన కల్పించే సమయంలో ఓ విద్యార్థి తీవ్రగాయాలతో చనిపోయింది. మాక్ డ్రిల్ కోసమే చెన్నైకి చెందిన ఫైర్  సేఫ్టీ బృందం.. 20 మంది స్టూడెంట్లను ఎంపిక చేసి 40 రోజులు శిక్షణ ఇచ్చింది.

విద్యార్థులను ఒక్కోక్కరికిగా రెండో అంతస్థు నుంచి కిందకు దూకించగా.. కింద విద్యార్థులు వల సాయంతో వారిని రక్షిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లోగేశ్వరి అనే 19 సంవత్సరాల బీబీఏ స్టూడెంట్ ను సహాయక సిబ్బంది కిందకు తోశారు. అయితే విద్యార్థిని అప్రమత్తగా లేకపోవడంతో కింద ఫ్లోర్ లో ఉన్న సెల్ఫ్ తలకు బలంగా తాకడంతో.. విద్యార్థిని స్పాట్ లోనే చనిపోయింది. సిబ్బంది నిర్లక్ష్యం.. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓ విద్యార్థి చినపోయినట్లు చెబుతున్నారు స్టూడెంట్స్. దూకేయాలి అంటూ ప్రోత్సహించిన వారు.. అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయటంలో విఫలం అయ్యారని చెబుతున్నారు. రెండో అంతస్తు నుంచి కిందకి దూకుతున్నారు అంటే.. మధ్యలో ఎలాంటి అవాంతరాలు ఉన్నాయి అనేది కనీసం చూసుకోలేదని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates