మాజీ ఎంపీ దారుణ హత్య : మనవడే చంపేశాడు

murderమద్యం మత్తులో సొంత తాతనే హత్య చేశాడు ఓ యువకుడు. ఈ దారుణ సంఘటన ఏపీలోని గుంటూరులో చోటు చేసుకుంది. అయితే మరణించి ఆ వ్యక్తి నరసరావుపేట మాజీ ఎంపీ కావడంతో ఈ విషయం ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. నరసరావుపేట మాజీ ఎంపీ కోట సైదయ్య (80),ను ఆయన మనవడు అంజి ఫుల్లుగా తాగివచ్చి, గొంతుకోసి చంపాడు.

ఆ తర్వాత అంజి పరారయ్యాడు. మాచర్ల మండలం 7వ మైలు చెంచు కాలనీలో ఆదివారం (జూన్-10) ఈ సంఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కోట సైదయ్య టీడీపీ నుంచి 1996లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కాసు వెంకట కృష్ణారెడ్డిపై 1858 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates