మాజీ సీఎం ఎన్ డీ తివారీ కన్నుమూత

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఎన్ డీ తివారీ(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తివారీ.. ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(గురువారం, అక్టోబర్-18) తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న ఆయన.. గతేడాది సెప్టెంబర్ 20న మ్యాక్స్ ఆస్పత్రిలో చేరారు. తివారీకి భార్య, కొడుకు ఉన్నారు. వికాస్ పురుష్ గా ఆయన పేరు పొందారు.

పుట్టిన రోజు నాడే తివారీ మరణించడం విషాదకరం. 1925, అక్టోబర్ 18న నైనిటాల్ జిల్లాలో తివారీ జన్మించాడు. తివారీ మృతిపట్ల ప్రధాని మోడీ, ఉత్తరాఖండ్ సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఎన్ డీ తివారీ సేవలందించారు. రాజీవ్ గాంధీ కేబినెట్ లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు.

Posted in Uncategorized

Latest Updates