మాజీ MP ల పెన్షన్లపై దాఖలైన పిల్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

COURT మాజీ MPలకు ఇచ్చే పెన్షన్లు, ట్రావెల్ అలవెన్సులు, ఇతర బెన్ ఫిట్లకు వ్యతిరేకంగా దాఖలైన పిల్ ను ఈ రోజు(ఏప్రిల్-16) సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ లతో కూడిన ధర్మాసనం ఈ పిల్ ను కొట్టేసింది. అయితే దీనికి సంబంధించిన తీర్పును కోర్టు ఈ ఏడాది మార్చి 7న రిజర్వులో ఉంచింది. MPల పదవీ కాలం పూర్తి అయినప్పటికీ వారు గౌరవ ప్రదంగా ఉండేందుకు పెన్షన్లు, ఇతర అలవెన్స్‌లు అందించడం కరెక్టేనని కేంద్ర ప్రభుత్వం నాటి విచారణలో న్యాయస్థానానికి తెలిపింది. MPల జీతాలు, పెన్షన్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేలా స్వతంత్ర యంత్రాంగాన్ని నియమించే అంశంపై తమ వైఖరి తెలియజేయాలంటూ ప్రభుత్వాన్ని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ విషయం తమ పరిగణనలో ఉందని ప్రభుత్వం తెలిపింది.
2017 మార్చిలో మాజీ MPలకు పెన్షన్లు ఇచ్చేందుకు సహకరిస్తున్న చట్టాల రాజ్యాంగ బద్ధతను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ‘లోక్‌ ప్రహరి’ అనే ఓ NGO మాజీ MPల పెన్షన్ల విషయంపై అలహాబాద్‌ హైకోర్టు తమ పిటిషన్‌ కొట్టేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Posted in Uncategorized

Latest Updates