మాట్లాడటం తగ్గింది : దిగజారిన తెలుగు స్థానం

teluguదేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదం నుంచి..తెలుగు లెస్ అనేలా మారుతోంది. ప్రస్తుత రోజుల్లో తెలుగు మాట్లాడటం తగ్గుతుందని సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న భాషల్లో ..దేశంలో అత్యధికంగా ప్రజలు హిందీ మాట్లాడుతున్నారని 2011 గణాంకాలు చెబుతున్నాయి. 2001లో హిందీ మాట్లాడే వారి సంఖ్య 41.03శాతం కాగా… 2011 నాటికి 43.63 శాతానికి పెరిగింది. జనాభా లెక్కల ప్రకారం 2.6 శాతం పెరుగుదల హిందీ మాతృభాషలో నమోదైతే… తెలుగు మాత్రం మూడో స్థానం నుంచి నాల్గో స్థానానికి దిగజారింది.

భారత్ రెండో పెద్దబాషగా బెంగాలీ అవతరించింది. ఇన్నాళ్లుగా మూడోస్థానంలో కొనసాగిన తెలుగును మరాఠి భర్తీ చేసి, తన పాత జ్ఞాపకాలను పదిలం చేసుకున్నట్లు జనాభా లెక్కలతో రుజువైంది. దేశంలో ఉన్న మొత్తం 22 ప్రాంతీయ భాషలో అట్టడుగున నిలిచింది శాన్స్ క్రిట్. కేవలం 24 వేల 821 మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. మాతృభాషలో మాట్లాడే బోడో, మణిపురి, కొంకణి, డోగ్రీ భాషల కంటే శాన్స్ క్రిట్ తక్కువగా మాట్లాడుతున్నట్లు స్పష్టమైంది.

Posted in Uncategorized

Latest Updates