మాదాపూర్ మెట్రో స్టేషన్ లో అగ్నిప్రమాదం

hitechstationహైదరాబాద్ మాదాపూర్ మెట్రో స్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి-5) సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషల్ లోపల వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిరి పడి మంటలు చెలరేగాయి. మెట్రో అధికారులు స్పందించి వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ సేఫ్టీ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన సిబ్బందిని సమీప ఆస్పత్రికి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates