మానకొండూరులో ఘోర ప్రమాదం : లారీ – ఆర్టీసీ బస్సు ఢీ : ఆరుగురి మృతి

road-accidentకరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం (మే-29) ఉదయం జిల్లాలోని మానకొండూరు మండలం చెంజెర్ల దగ్గర జరిగింది. క్షతగాత్రులను కరీంనగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా చెంజర్ల దగ్గర ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సును లారీ ఢీకొట్టింది.  ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వ్యైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే.. మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ నుంచి చెంజర్ల వెళ్లారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates