మానవత్వం ఎక్కడ : ఆత్మహత్య లైవ్.. అందరూ చూశారు.. ఎవరూ స్పందించలేదు

దారుణం అంటే దారుణం ఇది. ఆగ్రాకి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. తన ఫేస్ బుక్ నుంచి లైవ్ ఇచ్చాడు. అందరూ కళ్లప్పగించి చూశారు కానీ.. ఒక్కరు కూడా స్పందించలేదు. దీనిపై పోలీసులు సైతం ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లపై.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకి చెందిన మున్నా కుమార్ (24) బీఎస్సీ చదువుకున్నాడు. భగత్ సింగ్ వీరాభిమాని. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనేది కోరిక. దీంతో ఇప్పటికే ఐదుసార్లు ఆర్మీ రిక్రూట్ మెంట్ కు అటెండ్ అయ్యాడు. అయినా సెలక్ట్ కాలేదు. దీంతో నిరాశ చెందాడు. ఖాళీగా ఉన్న కుమారుడిని.. డ్రైవర్ గా పని చేస్తున్న తండ్రి.. తనకు సహాయం తీసుకెళుతున్నాడు. అనుకున్న ఉద్యోగం సాధించలేకపోయాను.. ఇంకెప్పటికీ ఆర్మీకి సెలక్ట్ కాలేను అంటూ ఫ్రెండ్స్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రైవర్ గా ఉద్యోగం చేయటానికి కూడా ఇష్టపడిన మున్నా కుమార్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు.

2018, జూలై 11వ తేదీ మధ్యాహ్నం ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే అతని సూసైడ్ లైవ్ ను 2వేల 750 మంది లైవ్ చూశారు. అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా అతని ఫ్రెండ్స్ కు, కుటుంబ సభ్యులకు, కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. కనీసం ఒక్కరంటే ఒక్కరు స్పందించినా ఓ నిండు ప్రాణం కాపాడేవాళ్లం అని పోలీసులు అంటున్నారు. 2వేల 750 మందిలో ఒక్కరికి కూడా పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలనే ఆలోచన లేకపోవటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మున్నాకుమార్ కు ధైర్యం చెప్పటం, ఆత్మహత్య వద్దని వారించటం కూడా జరగలేదని.. అతని ఆత్మహత్యను ఆపే ప్రయత్నాలు ఎవరూ చేయకపోగా అందరూ సినిమా చూసినట్లు చూశారని పోలీసులు అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates