మానవత్వం బతికే ఉంది : హిందూ మహిళకు.. ముస్లింల అంత్యక్రియలు

RAJANNAకులాలు, మతాలు, జాతులు వీటన్నిటికన్నా ముఖ్యమైనది మానవత్వం. ఈ విషయం మర్చిపోయిన చాలా మంది కులాలు, మతాల కొట్లాటలో ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ లో మాత్రం  భిన్నత్వంలో ఏకత్వం ఉందని చెప్పేందుకు ఏ మాత్రం ఆలోచించనవసరం లేదు. కులాలు, మతాలు, జాతులు వేరైయినా బంధుత్వంతో పలుకరించుకుంటూ జీవితాల్ని గడుపుతారు భారతీయులు. అందుకే ప్రపంచంలోనే భారత్ కు ప్రత్యేకమైన స్ధానం ఉంది.

శనివారం(జూన్-16) కర్ణాటకలోని విధ్యాపుర గ్రామంలో గుండెపోటుతో భవానీ(52) అనే మహిళ చనిపోయింది. ఈమెకు పెళ్లి కాలేదు. దీంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి సాయం చేయాల్సింది.. ఆమె తమ్ముడు క్రిష్ణ తన బంధువులను కోరాడు. శనివారం మధ్యాహ్నం వరకూ ఒక్కరు కూడా అతడికి సాయం చేసేందుకు వెళ్లలేదు. విషయం తెలుసుకున్న స్ధానిక ముస్లింలు ముందుకొచ్చారు. అభ్యంతరం లేకపోతే మేం ముందుంటాం అని భరోసా ఇచ్చారు. కృష్ణ కూడా అంగీకరించాడు. వెంటనే.. భవానీ అంత్యక్రియల కోసం ఫండ్స్ కలెక్ట్ చేశారు. ముస్లిం మహిళలు సఫియా, జుబైదా, అంగన్ వాడీ టీచర్ రాజేశ్వరీ స్వచ్చందంగా ముందుకు వచ్చారు. ముస్లింలు అయినా.. హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమం నిర్వహించారు. భవానీకి స్నానం చేయించారు. నలుగురు నాలుగు వైపుల నిలబడి పాడెను మోశారు ముస్లిం యువకులు. అంబులెన్స్ లో శ్మశానానికి  తీసుకెళ్లే వరకు అన్నీ దగ్గరుండి చేశారు.

విషయం తెలుసుకున్న మీడియా పరిగెత్తింది. వారిపై అసహనం వ్యక్తం చేశారు ముస్లింలు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేయలేదని స్పష్టం చేశారు. చనిపోయిన వ్యక్తికి కులం, మతం ఆపాదించడం తప్పు అన్నారు. హిందువైనా, ముస్లిం అయినా మనం అందరం మునుషులమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని స్ధానిక ముస్లింలు కోరారు. మీడియాతో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపలేదు. మానవత్వంగా ఆమె తమ్ముడు కృష్ణకు సాయం చేయటానికి మాత్రమే ముందుకు వచ్చాం అని.. భవానీ కూడా మాకు ఎంతో కాలంగా తెలుసు అని వివరించారు. హ్యాట్సాప్ కదా.. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కదా అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates