మానవత్వానికి ఎళ్లలు లేవు : పాముకు కంటి వైద్యం చేయించిన జంతుప్రేమికుడు

 పాము కనిపిస్తే చాలు ఎవరైనా ఆమడదూరం పరుగెత్తుతారు.. అదికూడా నాగుపాము అయితే.. ఇక చెప్పాల్సింది ఏముంది…  అటువంటి విషపూరితమైన వాటిపై కూడా మానవత్వాన్ని చూపాడు తమిళనాడుకు చెందిన వ్యక్తి.

రోడ్డుపై కళ్లు కనిపించకుండా పడి ఉన్న ఓ నాగుపామును హస్పిటల్ లో చేర్పించి జంతుప్రేమను చాటుకున్నారు  ఓ వాచ్ మెన్. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ లో జరిగింది. చంద్రన్ ఓ ప్రైవేటు సంస్థలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న చంద్రన్ కు రోడ్డు పక్కన ఓ పాము కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా.. అది కదలకుండా అలాగే ఉంది. దీంతో ఆ పామును ఓ సంచిలో వేసుకుని 90కి.మీ దూరంలో ఉన్న అటవీశాఖ వెటర్నరీ హస్పిటల్ కు తీసుకెళ్లారు చంద్రన్.

పామును పరీక్షించిన డాక్టర్లు.. దానికి రెండు కళ్లు కనిపించక ఆహారం దొరక్క.. రోడ్డుపై పడిఉందని తెలిపారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని పాము కోలుకుంటుందని డాక్టర్లు చెప్పారు. తొందరలో పాముకు చూపు వచ్చే అవకాశం కూడా ఉందని అన్నారు. రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న పామును తీసుకొచ్చి వైధ్యం అందేలా చేసిన చంద్రన్ ను డాక్టర్లు, అటవీ శాఖ అధికారులు అభినందించారు. ఈ విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది.

Posted in Uncategorized

Latest Updates