మానవ అవయవాల వ్యాపారం : 37 మందికి జైలుశిక్ష

అక్రమంగా మానవ అవయవాల వ్యాపారంలో భాగస్వాములైన 37మందికి జైలుశిక్ష విధించింది ఈజిప్ట్ కోర్టు. అవయవ వ్యాపారంలో పాల్గొన్నవారికి మూడేళ్ల నుంచి 15 ఏండ్ల వరకు జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు నిచ్చింది కైరో క్రిమినల్ కోర్టు. నిందితుల్లో ఆరుగురికి 15 ఏండ్లు, 11 మందికి ఏడేళ్లు, 20 మందికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా పేర్కొంది కోర్టు.

డాక్లర్లు, వైద్య విభాగంలో పనిచేసే సిబ్బంది, మధ్యవర్తులు అక్రమ అవయవ మార్పిడి, అవయవాల వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొన్నారని దర్యాప్తులో తేలినట్లు చెప్పారు అధికారులు. పేద ఈజిప్షియన్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అవయవ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తేలింది కోర్టు.

Posted in Uncategorized

Latest Updates