మానసిక ఒత్తిడికి చెక్ : ఏడాదిలో 2సార్లు నీట్, జేఈఈ ఎగ్జామ్స్

NEETజాతీయస్ధాయిలో నిర్వహించే నీట్‌, జేఈఈ, యూజీసీ నెట్‌, సీమ్యాట్‌ పరీక్షలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకొంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కీలక  సంస్కరణలు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకూ ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ పరీక్షలను ఇకపై ఏడాదిలో 2సార్లు నిర్వహించనున్నట్లు ఈరోజు(జులై-7) ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌  తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ గా ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.

ప్రతి ఏటా జనవరి, ఏప్రిల్‌ నెలల్లో జేఈఈ ఎగ్జామ్స్ ని, ఫిబ్రవరి, మే నెలల్లో నీట్‌ ఎగ్జామ్స్ ని నిర్వహిస్తామని జవదేకర్ తెలిపారు.దీనివల్ల లక్షల మంది విద్యార్ధులకు లాభం కలుగుతుందన్నారు. ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ రాసినప్పుడు సీట్ రానివారు మళ్లీ ఎగ్జామ్ రాసుకునే అవకాశం వస్తుందని, బెస్ట్‌ స్కోర్‌ను అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటామని జవదేకర్ తెలిపారు.

గతంలో ఈ విధానం లేకపోవడం ద్వరా ఎగ్జామ్ లో సీటు సాధించలేకపోయామనే మానసిక ఒత్తిడితో అనేక మంది విద్యార్ధులు సూసైడ్ కి పాల్పడేవారని, అయితే రెండు సార్లు పరీక్ష రాసే విధానం ద్వారా విద్యార్ధులకు మానసిక ఒత్తిడి ఉండదని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కూడా ఈ విధానం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు రెండు సార్లు నీట్‌ పరీక్షను రాస్తే వచ్చే బెస్ట్‌ స్కోర్‌ను అడ్మిషన్ల కోసం పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates