మానస సరోవర్‌లో చిక్కుకున్న3వేల మంది యాత్రికులు

Mansarovar-yatraకైలాస్ మానస సరోవర్ వెళ్లిన యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. హిల్సా బేస్ క్యాంపులో దాదాపు 3 వేల మంది యాత్రికులు చిక్కుకున్నారు. నేపాల్, చైనా సరిహద్దులో ఉన్న హిల్సా బేస్ క్యాంపులో వీళ్లు చిక్కుకున్నారు. మానస సరోవర్ యాత్రకు విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన యాత్రికులున్నారు. వాళ్లు హిల్సా నుంచి సిమిల్‌కోట్ చేరుకోవాలి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సేవలు నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణంతో యాత్రికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆహారం దొరక్క యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates