మానస సరోవర యాత్ర : చిక్కుకున్న 104 మంది క్షేమం

manasa yatraమానస సరోవర యాత్రలో పలువురు యాత్రికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు అతలాకుతులం అయిన మానస సరోవర ప్రాంతంలో చాలామందికి సిగ్నల్ అందక చిక్కుకున్నారు. దీంతో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది ..చిక్కుకున్న పలువురు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు గుర్తించింది.

యాత్రలో చిక్కుకున్న వారిలో సిమికోట్ ప్రాంతం నుంచి 104 మంది భారత యాత్రికులను అధికారులు కాపాడారు. వారిని ఏడు విమానాల్లో నేపాల్ గంజ్ కు తరలిస్తున్నారు. యాత్రలో ఆంధప్రదేశ్ లోని తూర్పు గోదావరికి చెందిన గ్రంథి సుబ్బారావు హిల్సా ప్రాంతంలో ప్రాణాలు విడిచాడు. అతని మృతదేహాన్ని నేపాల్ గంజ్ కు తరలించి పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం స్వస్థలానికి పంపిస్తామని తెలిపారు అధికారులు. హిల్సా ప్రాంతం  3 వేల 600 మీటర్ల ఎత్తులో ఉందని, ఆ ప్రాంతంలో చిక్కుకున్న యాత్రికులను కాపాడేందుకు నేపాల్ ప్రభుత్వం 11 హెలికాప్టర్లతో సహాయక చర్యలను కొనసాగిస్తుందని తెలిపారు నేపాల్ లో భారత రాయబారి బీకే రెజ్మీ.  సహాయక చర్యల్లో ప్రైవేట్ హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నామన్నారు. హిల్సా ప్రాంతంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates