మాఫియా డాన్ సంపత్ నెహరా అరెస్ట్

SAMPAT ARESTదేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ గా మారిన హర్యానాకు చెందిన మాఫియా డాన్ సంపత్ నెహరాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇరవై రోజులుగా మియాపూర్ లో ఉంటున్న నెహరాను.. సైబరాబాద్ ఎస్ఓటి, హర్యానా టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. హర్యానా , పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్ లో నెహరాపై పది హత్య కేసులు, మూడు హత్యాయత్నం కేసులున్నాయి. పదుల సంఖ్యలో దోపిడీలు, బెదిరింపు కేసుల్లో కీలక సూత్రధారి నెహరా. నెహర దగ్గర తుపాకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

పంజాబ్ వర్సిటీ స్టూడెంట్ అయిన సంపత్ నెహరాను 4 రాష్ట్రాల పోలీసులు పథకం పన్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మియాపూర్ గోఖుల్ ఫ్లాట్స్ లో 20 రోజులుగా నివాసం ఉంటున్న నెహరాను,.. నిఘా పెట్టి పట్టుకున్నారు. హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్ర పోలీసులు వెతుకుతున్నారని తెలిసి.. చండీగఢ్ లో కోబ్రాలో షెల్టర్ తీసుకున్న నెహరా.. అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. పక్కా సమాచారంతో.. సంపత్ నెహరాను ఇవాళ పోలీసులు పట్టుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates