మామా మజాకా..! కాంగ్రెస్ తో జేజేలు చెప్పించుకున్న శివరాజ్ సింగ్

మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్  ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. కాంగ్రెస్ సుప్రీమ్ రాహుల్ గాంధీ, మాజీ పీఎం మన్మోహన్ సింగ్, ఖర్గే లాంటి.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు ఎందరో ఈ వేడుకకు హాజరయ్యారు. గవర్నర్ ఆనందీబెన్ కమల్ నాథ్ తో సీఎంగా ప్రమాణం చేయించారు. ఐతే… ఈ కార్యక్రమానికి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు. రావడమే కాదు… కొత్త సీఎం కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా చేతులు పట్టుకుని.. ప్రజలకు అభివాదం చేశారు. ఆ సమయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. శివరాజ్ సింగ్ ఇలా అభినందించినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అభివాదాలు, కేకలతో ఆ ప్రాంగణం మార్మోగింది.

మధ్యప్రదేశ్ ను 13 ఏళ్ల పాటు ఏలిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను అక్కడ చాలామంది మామాజీ అని ప్రేమతో పిలుస్తుంటారు. “పదవి కోల్పోయిన నాయకులు మామూలుగా ఇంత స్పోర్టివ్ స్పిరిట్ ను చూపడం చాలా అరుదు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో మామ శివరాజ్ సింగ్ మరోసారి నిరూపించారు” అంటూ నెటిజన్లు స్పందించారు. శివరాజ్ జనంతో కలిసిపోయిన గుర్తులను ఫొటోల రూపంలో షేర్ చేసుకుంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates