మారథాన్‌ లో కిందపడ్డ దేవేగౌడ

బెంగళూరు: దసరా వేడుకల సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో చేపట్టిన మారథాన్‌ లో.. కర్ణాటక ఉన్నత విద్యాశాఖా మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి జీటీ దేవేగౌడ మారథాన్‌ లో పరుగులు తీస్తూ కిందపడిపోయారు. మారథాన్ లో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై దేవేగౌడను పైకి లేపారు.

68 ఏండ్ల వయసులోనూ దేవేగౌడ మారథాన్ లో పరుగులు తీస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. స్థానికులతో కలసి ఉత్సాహంగా పరుగెత్తారు. అయితే కొంత దూరం పరుగెత్తిన ఆయన అలవాటు లేని పని కావడంతో.. బొక్కబోర్లా పడ్డారు. అతని మోకాళ్లకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన మారథాన్‌ నిర్వాహకులు మంత్రిని పక్కకు తీసుకెళ్లారు. అందరూ రన్నింగ్‌‍ కు సౌకర్యాంగా ఉండే దుస్తులతో పరుగెత్తితే.. మంత్రి గారు మాత్రం లుంగీ పైకి కట్టి పరుగెత్తాడు. దీంతోనే పరుగు చేస్తూ కంట్రోల్ తప్పి పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

Posted in Uncategorized

Latest Updates