మార్కెట్ లోకి మోటొరోలా వన్ పవర్

 దిగ్గజ మొబైల్ కంపెనీ మోటొరోలా ఇండియన్ మార్కెట్ లోకి ఇవాళ(సెప్టెంబర్.24) న మోటొరోలా వన్ పవర్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది.  స్మార్ట్ ఫోన్ యూజర్స్.. ఫోన్ త్వరగా డిశ్చార్జ్ అవుతోందని బాధ పడుతుంటారు. వారిని దృష్టిలో ఉంచుకొని 5000 mah బ్యాటరీతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది . బ్యాటరీని 15 నిమిషాలు చార్జ్ చేస్తే ఆరు గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. మోటొరోలా వన్ పవర్ ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ లో దొరుకుతుంది. అక్టోబర్.5న జరిగే సేల్ కు  రిజిస్ర్టేషన్లు స్టార్ట్ అయ్యాయి. 4 జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ కెపాసిటీతో రిలీజైన ఈ ఫోన్ ధర రూ.15,999/-

మోటొరోలా వన్ పవర్ ఫోన్ స్పెసిఫికేషన్స్…

– 6.2 ఇంచెస్ స్క్రీన్

– IPS LCD డిస్ ప్లే టెక్నాలజీ

– క్వాల్ కామ్  స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్

– 5000 mah  బ్యాటరీ

– 4జీబీ ర్యామ్‌

– 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్

– Android v8.1 Oreo  ఆపరేటింగ్ సిస్టం

– Dual SIM, GSM+GSM

Posted in Uncategorized

Latest Updates