మార్కెట్ లో టీవీల యుద్ధం : భారీగా ధరలు తగ్గించిన కంపెనీలు

LED-Smart-Tvsఇండియాలో టీవీ మార్కెట్ వ్యాల్యూ ఎంతో తెలుసా.. అక్షరాల 22వేల కోట్లు. ఎప్పటికప్పుడు అప్ డేట్ టీవీలు వస్తుండటం.. కొత్త టీవీ కొనుగోలుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తుండటంతో.. అంతర్జాతీయంగా అన్ని కంపెనీలు ఇప్పుడు భారత్ లో మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. LCD, LED, స్మార్ట్ టీవీలదే ఇప్పుడు మర్కెట్ అంతా. ప్రస్తుతం మార్కెట్ లో లీడింగ్ శాంసంగ్, సోనీ, LG. ఈ మూడు కంపెనీల మార్కెట్ పై కన్నేసిన షియోమీ.. అత్యంత చౌక అయిన స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. దీంతో మార్కెట్ లో ఒక్కసారి ఈ మూడు కంపెనీలకు షాక్ అయ్యింది. షియోమీ 55 ఇంచ్ టీవీని కేవలం 45వేలకే అందిస్తోంది. దీంతో శాంసంగ్, ఎల్జీ, సోనీ కంపెనీలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

షియోమీ దెబ్బకు ఇప్పటికే TCL తమ బ్రాండ్ టీవీలపై 50 నుంచి 60శాతం డిస్కొంట్స్ ప్రకటించింది. ఓ వైపు షియోమీ, మరో వైపు TCL పోటీపోటాగా స్మార్ట్ టీవీ మార్కెట్ లోకి దూసుకెళ్తుండటంతో.. శాంసంగ్ మొదటి సారి ధరలను తగ్గించింది. ప్రస్తుతం 55 ఇంచ్ శాంసంగ్ టీవీ లక్ష రూపాయలు ఉండగా.. 30శాతం ధర తగ్గించింది. రూ.70వేలకే ఇంటికి తీసుకొచ్చి ఇస్తోంది. అదే విధంగా రూ.40వేలు ఉన్న 43-ఇంచ్ టీవీని రూ.34వేలకే అందిస్తోంది. గత క్వార్టర్ కాలంలో శాంసంగ్ టీవీ అమ్మకాలు 10 నుంచి 20శాతం తగ్గాయి. కంపెనీ బ్రాండ్ వ్యాల్యూ కంటే.. ధర, ఆప్షన్స్ విషయంలో కస్టమర్లు ఎక్కువగా ఆలోచిస్తుండటంతో.. ఇప్పుడు ధరలు తగ్గించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. శాంసంగ్ టీవీలు ధరలు ఈ స్థాయిలో తగ్గటం ఇదే మొదటిసారి అంటున్నారు. సోనీ, ఎల్జీ కంపెనీలు కూడా టీవీల ధరలు తగ్గించటానికి రెడీ అయ్యాయి. వచ్చే పండుగల సీజన్ నాటికి.. భారీ టీవీలు.. తక్కువ ధరలో లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates