మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్న కొనుగోలు: పోచారం

మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. కొనుగోళ్లకు ఎర్రజొన్న వ్యాపారులు ముందుకురాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గురువారం (ఫిబ్రవరి-15) సెక్రటేరియట్ లో మంత్రి పోచారం, ఎంపీ కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి పోచారం మాట్లాడుతూ.. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. రైతుల కష్టాలపై సీఎం ఎప్పటికపుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎర్రజొన్న కొనుగోళ్ల అంశంపై ఇవాళ సీఎం దృష్టికి తీసుకెళ్లామని.. ఎర్రజొన్న అంశంపై సీఎం కేసీఆర్‌తో ఎంపీ కవిత మాట్లాడారన్నారు మంత్రి పోచారం.

Posted in Uncategorized

Latest Updates