మార్చి 11న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

kcr-pass booksకొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం కేసీఆర్. ఇతర పట్టాదారులతో పాటే అసైన్డ్ భూములున్న వారికి కూడా కచ్చితంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించారు. కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతిభవన్లో CS SK జోషితో పాటు ముఖ్య అధికారులతో రివ్యూ చేశారు సీఎం. దేశంలో మరెక్కడా లేనట్టుగా రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందన్నారు.

అసలు లబ్దిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి, వాటి యాజమాన్యంపై స్పష్టతనివ్వాలని చెప్పారు. పాస్ పుస్తకాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతీ ఎంట్రీని ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని చెప్పారు. వ్యవసాయ భూమి కలిగిన రైతుకు అదే గ్రామంలో వ్యవసాయేతర భూమి ఉంటే, ఆ వివరాలు కూడా పాస్ పుస్తకంలో నమోదు చేయాలన్నారు. ఇందుకోసం అదనపు కాలమ్ పెట్టాలని ఆదేశించారు సీఎం. పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు నెంబరు కూడా కచ్చితంగా అనుసంధానం చేయాలన్నారు. మార్చి 11 నే పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ పంపిణీ చేయాలనే తొందరలో పొరపాట్లు జరగడానికి ఆస్కారం ఇవ్వొద్దన్నారు. అసైన్డ్ దారులకు సంబంధించిన పాస్ పుస్తకాల ప్రింటింగ్ కూడా పూర్తి కావడంతో పాటు, పాస్ పుస్తకంలో నమోదయ్యే వివరాలను పూర్తిగా పరిశీలించడానికి కొంత సమయం తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు KCR. భూరికార్డులకు ఆధార్ కార్డు లింక్ చేయడానికి కొంతమంది ముందుకు రావడం లేదని…. ఇప్పటికైనా వారు ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేయించుకోవాలన్నారు. లేదంటే ఆ భూములను బినామీ ఆస్తులుగా గుర్తించాల్సి వస్తుందన్నారు.

దేశంలో మరెక్కడా లేనట్టుగా రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందన్నారు సీఎం. రికార్డుల ప్రక్షాళన తర్వాత వచ్చిన వివరాలన్నీ ధరణి వెబ్ సైట్ లో నమోదు చేసే పని జరుగుతుందన్నారు. ఆ వివరాలతో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు సీఎం. సొంత భూమి ఉన్న రైతులతో పాటు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూమిని సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు కూడా సేకరించాలన్నారు. కలెక్టర్లతో మాట్లాడి కచ్చితమైన వివరాలు తెప్పించాలన్నారు. అసైన్డ్ దారులకు కూడా భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు KCR. పాస్ పుస్తకాల్లో నమోదయ్యే వివరాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని చెప్పారు. పాస్ పుస్తకాల తయారీ పక్కాగా జరిగిన తర్వాతే పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates