మార్చి 2న బుకింగ్స్ : శాంసంగ్ గెలాక్సీ S9, S9ప్లస్‌ లాంచ్‌

samsung-s9శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను గెలాక్సీ S9, S9ప్లస్‌ను లాంచ్‌ చేసింది.  స్పెయిన్‌, బార్సెలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2018 ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఆదివారం (ఫిబ్రవరి-25)  ఈ  స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. మార్చి 2వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్స్‌ మొదలు కానుండగా.. 16 నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. S9 ప్లస్‌లో డబుల్ రియర్‌ కెమెరాలు ఫేస్‌ రికగ్నిషన్‌, AR (అగ్‌మెంటెట్‌ రియాలిటీ) ఎమోజీ ఫీచర్స్ ఉన్నాయి.

రెండు హ్యాండ్ సెట్లు మిడ్‌ నైట్‌ బ్లాక్, కోరల్ బ్లూ, లిలాక్ పర్పుల్   టైటానియం గ్రే రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. గెలాక్సీ S9 ధర రూ.46వేల 600, S9ప్లస్‌ ధర రూ.54 వేలు 400 ఉండే అవకాశం ఉంది. అలాడే రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, డాల్బీ సరౌండ్‌  స్టీరియో సౌండ్‌ స్పీకర్లు అమర్చింది. ఐ ఫోన్‌ ఎక్స్‌ యానిమోజీల మాదిరిగా మన ఫోటోలతో రకరకాల ఎమోజీలను సృష్టించుకునే అవకాశాన్నికూడా కల్పిస్తోంది.

గెలాక్సీ S9 ఫీచర్లు
5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 8 ఓరియో
1440 x 2960 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4GB ర్యామ్‌
64GB స్టోరేజ్‌
12ఎంపీ కెమెరా
8MP సెల్ఫీ కెమెరా
3000 MAH బ్యాటరీ

గెలాక్సీ S9  ప్లస్‌  ఫీచర్లు
6.2 డిస్‌ప్లే,
6GB ర్యామ్‌,
256దాకా విస్తరించుకునే అవకాశం
డబుల్‌ రియర్‌ కెమెరాలు ప్రత్యేక ఫీచర్లుగా ఉండనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates