మార్చి 23న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

rajya sabhaరాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 3స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలు, బీహార్ 6, ఛత్తీస్‌గఢ్ 1, ఉత్తరాఖండ్ 1, పశ్చిమబెంగాల్ 5, ఒడిశా 3, జార్ఖండ్ 2, గుజరాత్ 4, హర్యానా 1, హిమాచల్ ప్రదేశ్ 1, కర్ణాటక 4, మధ్య ప్రదేశ్ 5, మహారాష్ట్ర 6, ఉత్తరప్రదేశ్ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మార్చి 5న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

…నామినేషన్ల దాఖలుకు చివరి తేది మార్చి 12

…నామినేషన్ల పరిశీలనకు చివరి తేదీ మార్చి 13

…నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 15

మార్చి 23న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 23 సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates