మార్పు మంచికే : తెలంగాణలో 14 జైళ్లు మూసివేత

dg-vk-singhజైళ్లశాఖ చేపట్టిన జైలు సంస్కరణలు ఫలితమిస్తున్నాయి. ఖైదీలకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలతో రిపీటెడ్‌ నేరాలు చేసే వారిలో మార్పు వస్తుంది. దీంతో వారు మళ్లీ నేరాల జోలికి వెళ్లటం లేదు. ఈ క్రమంలోనే జైళ్లకు వచ్చే నేరస్తుల సంఖ్య తగ్గుతున్నది. మూడేళ్లలో ఈ సంఖ్య బాగా తగ్గటంతో..  14 సబ్ జైళ్లను మూసివేయాలని జైళ్ల శాఖ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో 6వేల848 మంది ఖైదీలు ఉండే సామర్థ్యం ఉంది. ఇప్పుడు 5వేల 348 మంది మాత్రమే ఉన్నారు. దీంతో 14 సబ్ జైళ్లు కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నాయి.

రాష్ట్రంలోని మధిర, బోధన్, ఆర్మూర్, పర్కాల, నర్సంపేట, కొడంగల్, అచ్చంపేట, కొల్లాపూర్, నారాయణపేట, ఎల్లారెడ్డి, వెంకటాపురం, మంథని, సిర్పూర్, చెన్నూర్ సబ్ జైళ్లను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది జైళ్ల శాఖ. ప్రస్తుతం ఉన్న సంఖ్య కూడా వచ్చే ఐదేళ్లలో బాగా తగ్గిపోనుంది. 50శాతం అంటే.. 3వేల మంది మాత్రమే ఖైదీలు శిక్ష పడి జైళ్లకు రానున్నట్లు అంచనా వేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ వీకె సింగ్ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ జైళ్లతో భవిష్యత్ లోనూ అవసరం ఉండదని డిసైడ్ అయ్యారు. ఖాళీ అయ్యే జైళ్లను.. శాఖ పరిధిలోనే ఇతర అవసరాలకు వినియోగించాలని ఆ శాఖ నిర్ణయం తీసుకుంది.

Posted in Uncategorized

Latest Updates