మార్స్ గ్రహంపై గాలి…పసికట్టిన ఇన్‌సైట్ ల్యాండర్

మార్స్ గ్ర‌హంపై వీస్తున్న గాలిని ఇన్‌సైట్ ల్యాండర్ ప‌సిక‌ట్టింది. ఇటీవ‌ల నాసాకు చెందిన ఇన్‌సైట్ ల్యాండ‌ర్ అరుణ‌ గ్ర‌హంపై దిగింది. అయితే ఆ గ్ర‌హంపై గాలులు వీస్తున్న‌ట్లు ఇన్‌సైట్ గుర్తించింది. గాలి శ‌బ్ధ త‌రంగాల‌ను విన్న‌ట్లు అమెరికా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. సుమారు గంట‌కు 10 నుంచి 15 మీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన ప‌వ‌నాలు వీస్తున్న‌ట్లు సైంటిస్టులు గుర్తించారు. న‌వంబ‌ర్ 26వ తేదీన ఇన్‌సైట్ .. మార్స్‌పై దిగింది. దానికి చెందిన సోలార్ ప్యానెల్స్ అక్క‌డ ఈ శ‌బ్ధాల‌ను గ్ర‌హించాయి. ల్యాండ‌ర్ లో ఉన్న ఎయిర్ ప్రెజ‌ర్ సెన్సార్లు.. గాలి ధ్వ‌నుల‌ను గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ల్యాండ‌ర్ డెక్ మీద ఉన్న సెసిమోమీట‌ర్ కూడా వాయు శ‌బ్ధాల‌ను ప‌సిక‌ట్టింది. గాలిలో జెండా ఎగురుతుంటే వ‌చ్చే శ‌బ్ధం త‌ర‌హాలో మార్స్ గ్ర‌హంపై శబ్ధాలు వినిపిస్తున్నాయ‌ని ఇంపీరియ‌ల్ కాలేజీ ప్రొఫెస‌ర్ థామ‌స్ పైక్ తెలిపారు. 1976లో మార్స్ గ్ర‌హంపై దిగిన వికింగ్ 1, వికింగ్ 2 ల్యాండ‌ర్లు కూడా గాలి శ‌బ్దాల‌ను గ్ర‌హించిన‌ట్లు సైంటిస్టులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates