మాలాల బయోపిక్ “గుల్ మకాయ్” ఫస్టు లుక్

malalaaనోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మలాల యూసుఫ్ జాయ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న గుల్ మ‌కాయ్‌ సినిమా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు అంజద్‌ ఖాన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలాలా పాత్రలో బాలీవుడ్‌ నటి రీమ్‌ షేక్‌ నటిస్తోంది.

సినిమా థీమ్‌ను తెలియజేసేలా ఈ ఫస్ట్‌లుక్‌ను రూపొందించారు. మలాల చేతిలో పుస్తకం పట్టుకొని ఉండగా.. పుస్తకాన్ని ఉగ్రవాదులు తగలబెట్టినట్లుగా పోస్టర్‌లో చూపించారు. తాలిబన్ల అరాచకాలకు ముస్లీం బాలికలు ఎలా చదువుకు దూరమయ్యారనే విషయాన్ని ఫస్ట్‌ లుక్‌లో చూపించారు. ఈ సినిమాలో మ‌లాలా త‌ల్లి పాత్ర‌ను దివ్య ద‌త్తా పోషిస్తున్నారు. అలాగే ఇందులో ఓం పురి, రాగిణి ఖ‌న్నాలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates