మాల్దీవులకు భారత్ రూ.10వేల కోట్ల సాయం

న్యూఢిల్లీ: మాల్దీవుల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ 10,026 కోట్ల రూపాయలు (1.4 బిలియన్ డాలర్లు) సాయం ప్రకటించారు. నిన్న(సోమవారం) ఢిల్లీలో ప్రధానితో మాల్దీవుల అధ్యక్షడు మహమ్మద్ ఇబ్రహీం సోలి సమావేశమయ్యారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇద్దరూ చర్చించారు. మాల్దీవులతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుస్తామని, ఇండియన్ కంపెనీలకు అక్కడ అవకాశాలు ఉన్నాయని ప్రధాని అన్నారు.

వాణిజ్యం, ఆరోగ్యం, రక్షణ రంగాల్లో రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. హిందూ మహాసముద్రంలో భద్రత విషయంలో రెండు దేశాలు అంగీకరించాయి. మాల్దీవుల ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మూడు రోజుల పర్యటన కోసం ఇబ్రహీం సోలి ఆదివారం ఇండియాకు వచ్చారు.

Posted in Uncategorized

Latest Updates