మాల్దీవుల్లో ఎమర్జెన్సీ : ఇద్దరు సుప్రీం జడ్టీలు అరెస్ట్

maldives-reuters_650x400_71517844363మాల్దీవ్స్ సుప్రీంకోర్టు జడ్జీలు ఇద్దరు అరెస్టయ్యారు. మాల్దీవ్స్ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ఎమర్జెన్సీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్ ని… మరో న్యాయమూర్తి అలీ హమీద్ ని నిర్భంధించారు. అబ్దుల్లా యమీన్ కు వ్యతిరేకంగా కొంతమంది ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అయినా యమీన్ సుప్రీంతీర్పును పాటించలేదు. రాజకీయ ఖైదీలను విడుదల చేస్తే తన అధికారానికి ఆటంకం కల్గుతుందన్నది యమీన్ భావన. అందుకే తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఇద్దరు జస్టిస్ లను అరెస్ట్ చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యమీన్ పాలనను.. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ మాల్దీవుల్లో ఆందోళనలు చేస్తున్నారు జనం.

Posted in Uncategorized

Latest Updates