మాల్యాకి మొగుళ్లు : బ్యాంక్ లో రూ.11వేల కోట్ల కుంభకోణం

pnbభారీ నష్టాలతో పతనమవుతున్న బ్యాంకింగ్ రంగానికి మరో బ్యాడ్ న్యూస్. పంజాబ్  నేషనల్ బ్యాంక్ ముంబై బ్రాంచ్‌లో రూ.11 వేల 550కోట్ల కుంభకోణం జరిగింది. ఈ విషయాన్ని ఆ బ్యాంకే బుధవారం (ఫిబ్రవరి-14) వెల్లడించింది. ఇది ఇతర బ్యాంకులపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముంబైలోని ఆ బ్రాంచ్‌లో కొన్ని మోసపూరిత, అనధికారికి లావాదేవీలు జరిగినట్లు PNB గుర్తించింది.

కొందరు ఖాతాదారుల కోసమే ఈ లావాదేవీలు జరిగాయి. లావాదేవీల ఆధారంగా విదేశాల్లోని సదరు ఖాతాదారుల అకౌంట్లలోకి ఇతర బ్యాంకులు కూడా భారీగా సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఓ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది PNB. ఈ కుంభకోణంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించలేదు. ఈ స్కాంపై విచారణ సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు చెప్పింది PNB.

పంజాబ్ నేషనల్ బ్యాంకును 280 కోట్ల రూపాయలకు మోసం చేశాడనే ఆరోపణలపై ఇప్పటికే వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీపై విచారణ జరుగుతుంది. మరో ముగ్గురిపైన సీబీఐ వారం క్రితమే కేసు పెట్టి విచారణ చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.11వేల కోట్ల కుంభకోణం బయటడడంతో స్టాక్ మార్కెట్ లో బ్యాంక్ షేర్ల విలువ పడిపోయింది. ఒక్కో షేరు 15 రూపాయలు నష్టపోయింది. ప్రస్తుతం రూ.145 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక్కరోజులోనే 10శాతం తగ్గటం ఇదే..

Posted in Uncategorized

Latest Updates