మాల్యానే కాదు.. దేశాన్ని మోసం చేసిన ఎవ్వరినీ వదలం : జైట్లీ

బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి పరారీలో ఉన్న విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలంటూ యూకేలోని వెస్ట్ మినిస్టర్ కోర్ట్ ఆదేశాలు ఇవ్వడాన్ని కేంద్రప్రభుత్వం స్వాగతించింది. కోర్టు ఇచ్చిన తీర్పు భారత్ కు చాలా అనుకూలమని…. ఇది ఇండియాకు గొప్ప రోజు అని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. భారత దేశానికి పన్నులు కట్టకుండా మోసం చేసిన ఏ ఒక్క ఆర్థిక నేరగాడిని అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జైట్లీ అన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నేరగాడు లబ్ది పొందాడని..  జైట్లీ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు విజయ్ మాల్యాను తిరిగి వెనక్కి తీసుకొచ్చిందని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates