మాల్యా ఇండియాకొస్తే…ఉండబోయేది ఇక్కడే

బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌వేసిన విజ‌య్ మాల్యాను యూకేలోని వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు తీర్పునిచ్చింది.త్వ‌ర‌లోనే మాల్యాను భార‌త్‌కు తీసుకువ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.ఆయన కోసం ముంబైలోని అత్యంత ప్రాచీనమైన ఆర్థర్ రోడ్ జైలు సిద్ధంగా ఉంది. ఈ జైలులో కట్టుదిట్టమైన భద్రతతోపాటు మాల్యా కోసం ప్రత్యేక ఏర్పాట్లతో బ్యారక్ నెం.12లో ఓ గదిని కూడా రెడీగా ఉంచారు.

ఈ గది జైలు ఏరియాలోని రెండు అంతస్థుల భవనంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల బ్యారక్స్‌లో ఉంది. మాల్యాను ఇక్కడికి తీసుకొస్తే… చూసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు జైలు అధికారులు. సురక్షితంగా చూసుకోవడంతోపాటు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామన్నారు. వైద్యం అవసరమైతే సమీపంలోనే డిస్పెన్సరీ ఉందని తెలిపారు. బ్యారక్ నెం.12 మిగతా సెల్స్ కన్నా వేరుగా ఉంటుందన్నారు. సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘాతో పాటు…భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉంటారని తెలిపారు అధికారులు.

భారతదేశంలో జైళ్ళు ఉండేందుకు సరిగ్గా ఉండవని విజయ్ మాల్యా లండన్ కోర్టుకు తెలిపాడు. సహజమైన వెలుగు, తాజా గాలి రాదని చెప్పాడు. దీంతో జడ్జి స్పందిస్తూ ఆర్థర్ రోడ్ జైలులో ఓ గదికి సంబంధించిన వీడియోను చూపించాలని కోరారు. కృత్రిమమైన లైటింగ్ పెట్టకుండా, మధ్యాహ్నం సమయంలో వీడియోను షూట్ తెలిపారు. దీంతో CBI 10 నిమిషాల నిడివిగల వీడియోను షూట్ చేసి.. లండన్ కోర్టుకు సమర్పించింది.

Posted in Uncategorized

Latest Updates