మాల్యా, మోడీ దగ్గరకి పంపించాలి : అప్పు కట్టాలంటూ బ్యాంక్ మేనేజర్ ధర్నా

BANK

దేశం మొత్తం గగ్గోలు పెడుతుంది. మాల్యా, నీరవ్ మోడీ, కొఠారి, లలిత్ మోడీ.. వేల కోట్ల కొల్లగొట్టి విదేశాలకు దర్జాగా వెళ్లిపోయారు. లక్షల కోట్లు జనం సొమ్మును అప్పనం కాజేసి ఎందరో పారిశ్రామికవేత్తలు రోడ్లపై తిరుగుతున్నారు. ఈ కుంభకోణాలు అన్నింటికీ కారణం ఎవరో తెలుసా బ్యాంకులే. ఇటువంటి టైంలో.. ఓ బ్యాంక్ మేనేజర్ తీసుకున్న అప్పు కట్టాలంటూ ఏకంగా ధర్నాకి దిగాడు. ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లందలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఇల్లంద గ్రామానికి చెందిన తాటికాయల చంద్రమ్మ ఆధ్వర్యంలోని పార్వతి మహిళా పొదుపు సంఘం ఉంది. ఈ సంఘం 2017 ఫిబ్రవరిలో బ్యాంకు నుంచి రూ.8 లక్షలు అప్పు తీసుకుంది. ఇప్పటికి ఏడాది మాత్రమే అయ్యింది. గడువు తీరిపోవడంతో తీసుకున్న అప్పు  కట్టాలంటూ.. బ్యాంకు సిబ్బంది గ్రామానికి వచ్చి మరీ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 17న చెల్లిస్తామని సంఘం సభ్యులు చెప్పారు. దీనికి సరే అని అప్పుడు వెళ్లిపోయారు. 17వ తేదీ గడువు కూడా ముగిసిపోవటంతో.. 20వ తేదీన సిబ్బందితో కలిసి  బ్యాంకు మేనేజర్‌ కృష్ణారెడ్డి గ్రామానికి వచ్చారు. పొదుపు సంఘం లీడర్ చంద్రమ్మ ఇంటికి వచ్చారు. డబ్బులు కట్టాలని డిమాండ్ చేశారు. మరికొంత సమయం కావాలని కోరింది ఆమె.

ఇప్పటికే ఇచ్చిన గడువు కూడా అయిపోయింది.. వెంటనే కట్టాలంటూ చంద్రమ్మ ఇంటి ఎదుట ధర్నాకి దిగాడు. చాప వేసుకుని కూర్చుకున్నాడు. డబ్బులు కడితేనే వెళతానంటూ భీష్మించి కూర్చుకున్నాడు మేనేజర్. ఎంత చెప్పినా వినకపోవటంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకున్నారు. త్వరలోనే చెల్లించేలా హామీ ఇచ్చారు. దీంతో బ్యాంక్‌ మేనేజర్‌ ఆందోళన విరమించి వెళ్లిపోయారు. ఎంత కమిట్ మెంట్.. ఎన్ని గట్స్ .. ఇలాంటి మేనేజర్లను లలిత్ మోడీ, మాల్యా, నీరవ్ మోడీ దగ్గరకి పంపించి ఉంటే డబ్బులు ఎందుకు రావండీ అంటున్నారు గ్రామస్తులు..

Posted in Uncategorized

Latest Updates