మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్

రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. సమస్యాత్మకంగా ఉన్న 13 నియోజక వర్గాలకు పోలింగ్ ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నియోజకవర్గాల్లో 70 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు.

 పోలింగ్ ముగినిన నియోజకవర్గాలు ఇవి ..
కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాలు.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలు.. పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates