మావోయిస్ట్ కుట్ర : రాజీవ్ గాంధీ తరహాలో.. మోడీకి స్కెచ్ వేశారు

modiమాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ హతమార్చిన తరహాలోనే… ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు ప్లాన్ చేసినట్లు పూణే పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన గత ఏడాది ఏప్రిల్ లో మావోయిస్టులు రాసిన ఓ లేఖను శుక్రవారం(జూన్-8) విడుదల చేశారు. రోడ్‌షో సమయంలో మోదీని టార్గెట్ చేయడం ఉత్తమం అని ఆ లేఖలో మావోలు ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. కామ్రేడ్ కిషన్‌ తో పాటు ఇతర కామ్రేడ్లు ఈ లేఖను రాశారు. ప్రధాని మోడీ తమకు కొరకరాని కొయ్యగా మారాడని, తమ మనుగడ కష్టమవుతుందని, అదీకాకుండా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం హత్య కుట్రకు ఓ కారణమని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో ఇటీవల  జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందులో ఒకడైన జాకబ్‌ విల్సన్‌ ను అరెస్ట్‌ చేసిన ఇంటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. మోదీ హత్యకు కుట్ర పన్నడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Posted in Uncategorized

Latest Updates