మావోలకు పేలుడు పదార్థాలు అందిస్తున్న హైదరాబాదీ అరెస్టు

ఛత్తీస్‌ గఢ్‌లో నక్కా వెంకట్ రావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు అందజేస్తుండగా వెంకట్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కు చెందిన వెంకట్ రావు NGRI లో ఉద్యోగం చేస్తున్నాడు. 2016, 2017లలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో ఆయన సమావేశమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటరావుతో పాటు పౌరహక్కుల సంఘంలో కీలక నేతగా ఉన్న ఆయన సోదరుడు కూడా..అర్బన్‌ నక్సలిజం వ్యాప్తిలో కీలక పాత్ర పోషించాడు. ఏడు రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి నక్కా వెంకట్రావు కృషి చేశాడు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు  పనిచేశాడని ఛత్తీస్‌గఢ్‌ ఐజీ ఎస్పీ సింగ్‌ తెలిపారు. అయితే అతడిని అరెస్టు చేయడం ద్వారా అర్బన్‌ నక్సల్స్‌ నెట్‌వర్క్‌ను బ్రేక్‌ చేశామన్నారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates