మా టెక్నాలజీ సపరేట్ : సైబర్ దాడులతో సింగపూర్ లో సెగలు

సైబర్ ఎటాక్ లతో సింగపూర్ గజగజలాడుతుంది. టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సింగపూర్ పైనే హ్యాకర్లు సైబర్ ఎటాక్ చేశారు. సాక్ష్యాత్తూ ప్రధాని పర్సనల్ డీటెయిల్స్ ను హ్యాక్ చేయడానికే ఈ సైబర్ ఎటాక్ జరిగిందని సింగపూర్ హెల్త్‌ మినిస్టర్‌ గన్‌ కిమ్‌ యోంగ్‌ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంది.

సింగపూర్ ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన డేటాబేస్‌ నుంచి 15 లక్షల మంది సింగపూర్‌ ప్రజల హెల్త్ డీటెయిల్స్ ను  సైబర్‌ నేరగాళ్లు దొంగిలించారు. అయితే ఈ సైబర్ ఎటాక్ వెనుక ప్రధాన ఉద్దేశ్యం…  ప్రధాని లీ హీన్‌ లూంగ్‌ ఆరోగ్య రహస్యాలను కాజేయడానికేనని నిఘా వర్గాలు తెలిపాయి. ఇది ఆకతాయిల చర్యగా తాము భావించడం లేదన్నారు. ఓ పథకం ప్రకారమే సైబర్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. సైబర్ దాడులతో సింగపూర్ ప్రభుత్వం అలర్ట్ అయింది. సిటీ నడిబొడ్డున్న రక్షణ శాఖకు చెందిన అధునాతన ఆయుధాలు ఉన్నందున సైబర్‌ దాడులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు తెలిపింది. అయితే గతేడాది కూడా  రక్షణ శాఖ డేటాబేస్‌ నుంచి 850 మంది ఆర్మీ అధికారుల వివరాలను సైబర్ నేరగాళ్లు  హ్యాక్‌ చేశారు.

Posted in Uncategorized

Latest Updates