మా డబ్బు.. మా ఇష్టం : బ్యాంకుల్లో కంటే ఇళ్లల్లోనే ఎక్కువ ఉంది

2000-notesబ్యాంకుల్లో నగదు కొరత.. ATMల్లో డబ్బులు లేకపోవడం.. కేంద్రం ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు తెస్తుందనే భయం.. మళ్లీ పెద్ద నోట్లను రద్దు చేస్తారనే పుకార్లతో బ్యాంకుల జోలికి వెళ్లటం లేదు ప్రజలు. బ్యాంకుల్లో డబ్బులు వేయటం కంటే.. ఇంట్లోని బీరువాల్లో దాచుకోవటమే బెటర్ అనుకుంటున్నారు. ఎక్కువగా నగదు అంటే రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లిస్తున్నారు. అసలు బ్యాంకుల్లో డిపాజిట్ చేద్దాం అనే ఆలోచనే భయాందోళనకు గురి చేస్తోంది ప్రజలుకు. దేశవ్యాప్తంగా..  18.5 లక్షల కోట్ల నగదు ప్రజలు ఇళ్లలోనే పెట్టుకున్నట్లు RBI వెల్లడించింది.

2016 అక్టోబరులో రూ. 17 లక్షల కోట్లు ప్రజల దగ్గర ఉంటే.. ఇప్పుడు లక్షన్నర కోట్లు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది RBI. ప్రజలు నగదును ఇళ్లల్లో దాచుకోవటం వల్లే.. బ్యాంకులు, ATMలలో కొరత వస్తోందని చెబుతున్నారు RBI అధికారులు. రెండు లక్షలు అవసరమై.. బ్యాంకుకి వెళితే.. రేపు, ఎల్లుండి రండి అంటూ కస్టమర్లకు సమాధానం వస్తుంది. అత్యవసర సమయంలో మన డబ్బు మనం తీసుకోవటానికి కూడా బ్యాంకులు ఆంక్షలు పెడుతుండటంతో.. ప్రజలు తమ డబ్బుని ఇళ్లల్లోని భద్రతంగా దాచుకుంటున్నారు.

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి అంటే.. 2014లో ప్రజలు దాచుకున్న డబ్బు రూ.13 లక్షల కోట్లుగా ఉంది. 2016 అక్టోబరులో నాటికి రూ.17 లక్షల కోట్లుగా ఉంది. 2016 నవంబరులో నోట్ల రద్దు ప్రకటన తర్వాత.. 2017 జనవరి నాటికి అతి తక్కువగా రూ.7.8 లక్షల కోట్లుగా ఉంది. నోట్ల రద్దు ప్రక్రియ మొత్తం పూర్తయ్యింది ఇప్పుడు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని నోట్లు కలుపుకుని రూ.19.3 లక్షల కోట్లు సర్క్యూలేషన్‌లో ఉంటే.. ప్రజలు, వ్యాపారులు బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేయకపోవడం వల్ల రూ. 18.5 లక్షల కోట్లకి చేరింది..

Posted in Uncategorized

Latest Updates