‘మా’ తీర్పు: సినీ ఇండస్ట్రీ నుంచి శ్రీరెడ్డి బహిష్కరణ

maa
ఫిలిం చాంబర్‌పై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి పై చర్యలు తీసుకునేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) రెడీ అయ్యింది. ఫిలిం ఛాంబర్‌ దగ్గర అసభ్యంగా ప్రవర్తించిన ఆమెకు సభ్యత్వం ఇవ్వకూడదని  నిర్ణయించింది. శ్రీరెడ్డి వివాదంపై ఆదివారం(ఏప్రిల్-8) అత్యవసరంగా సమావేశమైన మా అసోషియేషన్ సభ్యులు సభ్యత్వ నమోదుపై ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరెడ్డికి ‘మా’లో సభ్యత్వానికి దరఖాస్తు ఇచ్చామని.. అయితే ఆమె పూర్తి వివరాలు ఇవ్వక పోగా.. డబ్బులు చెల్లించకుండా సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేసిందని అసోషియేషన్ ఆరోపించింది.

ఫిలిం ఛాంబర్‌లో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు మా అధ్యక్షుడు శివాజీరాజా. అసోషియేషన్‌లో ఉన్న 900మంది సభ్యులు శ్రీరెడ్డితో నటించకూడదని ‘మా’ తీర్మానించినట్లు తెలిపారు. ఇతర నటీనటులెవరైనా శ్రీరెడ్డిలా ప్రవర్తిస్తే ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని మా అసోషియేషన్ హెచ్చరించింది. వివాదం చేస్తే కార్డ్ వస్తుందని భావించటం తప్పన్నారు. మా అసోషియేషన్‌కు తెలంగాణ ఫిలిం చాంబర్ కూడా మద్ధతు తెలిపింది.

 

Posted in Uncategorized

Latest Updates