మా దేశాన్ని కాపాడండి : ఇండియాకు మాల్దీవుల వేడుకోలు

nasతమ దేశంలో న్యాయ వ్యవస్థను కాపాడాలని మాల్దీవుల సుప్రీంకోర్టు భారత్ ను కోరింది. అంతర్గత సంక్షోభంలో ఉన్న మాల్దీవులను కాపాడే శక్తి ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు మాత్రమే ఉందని మాల్దీవుల సుప్రీంకోర్టు.. భారత్ ను కోరింది. మాల్దీవులలో ఆ దేశ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు మధ్య వివాదాలు నడుస్తున్నాయి. కొన్ని రోజులుగా  దేశ అధ్యక్షుడిని తొలగించాలని సుప్రీంకోర్టు, జడ్జిలను తొలగించాలని దేశ అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వివాదంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సుప్రీం ఇచ్చిన ఆదేశాలను దేశ అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్ లెక్కచేయకపోవడమే ఇందుకు కారణమైంది. దీంతో తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని పరిస్ధితిని చక్కదిద్దాలని మాల్దీవుల సుప్రీంకోర్లు భారత్ ను కోరింది.

Posted in Uncategorized

Latest Updates