మా బలం పెరిగింది : 2019 ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకం

DALITSSభారత జనాభాలో అయిదో వంతు ఉన్న దళితులు 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారనున్నారు. కొత్త తరం దళితుల సంఖ్య ఈసారి గణనీయంగా పెరగడంతో ఎన్నికల్లో వారే కీలక ఓటు బ్యాంకు కానున్నారు. 2.3 కోట్ల మంది యువ దళిత ఓటర్లు తొలిసారిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దేశం మొత్తమ్మీద ఉన్న దళిత జనాభాలో వీరే 19 శాతం ఉన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే వారి సంఖ్య అత్యధికంగా ఉంది.

1991–2011 మధ్య కాలంలో భారత జనాభా పెరుగుదల రేటు కంటే దళిత జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఈసారి యువ దళిత ఓటర్ల సంఖ్య పెరిగింది. అలాగే ఈ కొత్త తరం ఓటర్లలో 90 శాతం మంది చదువుకున్నవారే. తత్ఫలితంగా దళితులు సామాజికంగా ఎంత అణచివేతకు గురవుతున్నారు.. ఏయే రంగాల్లో తమ వర్గం పరిస్థితి ఎలా ఉందన్న అవగాహన వారిలో బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం 27 వేల 518 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా వాటిలో మూడో వంతు దళితులకు రిజర్వ్‌ చేసినవే.

అయితే ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 2012 సంవత్సరం నుంచి ఒక్క ప్రయత్నం జరగలేదు. అలాగే దళిత వర్గానికి చెందిన వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారుల కంటే బాగా కింది స్థాయి ఉద్యోగాల్లోనే ఎక్కువగా పనిచేస్తుండటంతో యువ దళితులు అసహనంతో ఉన్నారు. అన్యాయాలపై గళమెత్తి ప్రశ్నించే వారి సంఖ్య  పెరిగింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళితులకు ఇప్పటినుంచే బుజ్జగించే పనిలో పడ్డారు రాజకీయ నేతలు.

 

Posted in Uncategorized

Latest Updates