మా రహస్యం మీతోనే ఉండాలి కేటీఆర్ సార్

 భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ల పెళ్లి విందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హజరయ్యారు. ఈ వేడుక హైదరాబాద్ లోని నోవాటేల్ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా జరిగింది. డిన్నర్ కు రాజకీయ ప్రముఖులు.. సినీ సెలబ్రిటీస్ తో పాటు.. పలు రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు.

కేటీఆర్ హాజరై..  సైనా, కశ్యప్ దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు కేటీఆర్ కు కశ్యప్ థ్యాంక్స్ చెప్పాడు. ” మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీకు థ్యాంక్స్ కేటీఆర్ సార్.. మా సీక్రెట్ స్టోరి మీతో సేఫ్ గా ఉండాలి” అని ట్వీట్ చేశాడు. సైనా, కశ్యప్ ల పెళ్లి ఢిసెంబర్ 14 న జరిగింది. రాయదుర్గంలోని  ‘ఒరియన్‌ విల్లా’లో వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates