మా రూ.2వందల కోట్లు ఇప్పించండి.. రిషబ్ చిట్స్ బాధితుల గోడు

హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సైబర్ క్రైమ్స్ ఆఫీస్ ముందు రిషబ్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాధితులు ఆందోళనకు దిగారు. కోట్లాది రూపాయల తమ కష్టార్జితాన్ని దోచుకుని నిర్వాహకులు పారిపోయారని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిషబ్ చిట్ ఫంట్స్ సంస్థ నిర్వాహకులు శైలేష్ గుజ్జార్, నందినిలను పట్టుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ బాధితులు… హైదరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధిక వడ్డీల ఆశ చూపి.. భారీస్థాయిలో డిపాజిట్లు, చిట్టీలను కట్టించుకున్న రిషబ్ చిట్ ఫండ్ సంస్థ ఖాతాదారులను మోసం చేసింది. ఈ నెల మొదటివారంలో.. మహంకాళి పోలీసులకు బాధితులు కంప్లయింట్ చేశారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయగూడకు చెందిన శైలేష్ గుజ్జార్ తన భార్య నందినితో కలిసి 20 ఏళ్లుగా శ్రీ రిషబ్ చిట్ ఫండ్ సంస్థను నడిపించాడు. మహంకాళి ఏరియా.. సుభాశ్ రోడ్డులో చాలాఏళ్లుగా ఈ చిట్ ఫండ్ సంస్థ పనిచేస్తుండటంతో.. జనాలు కూడా నమ్మి.. తమ డబ్బును భారీస్థాయిలో అందులో డిపాజిట్లు, చిట్ల రూపంలో దాచుకున్నారు. వందకు రెండు రూపాయల చొప్పున వడ్డీ చెల్లిస్తూ… కోట్లాది రూపాయలను తమ సంస్థలో డిపాజిట్ చేయించారు శైలేష్ గుజ్జార్. చిట్టీలు పూర్తయినవారి డబ్బులను కూడా అధిక వడ్డీ ఆశ చూపి.. తమ దగ్గరే పెట్టుకున్నారు. ఖాతాదారులను నమ్మించి.. మొత్తంగా రూ.200కోట్లతో పారిపోయారు నిర్వాహకులు.

Posted in Uncategorized

Latest Updates