మా వ్యాపారాన్ని నోట్ల రద్దు ముంచేసింది : వీడియోకాన్

VIDEOCONమోడీ ప్రభుత్వం తీసుకున్న డీమోనిటైజేషన్‌ నిర్ణయం వల్లే మా CRT టెలివిజన్ల వ్యాపారాన్ని ముంచేసిందని తెలిపింది వీడియోకాన్. బ్యాంకులకు  రూ.20 వేల కోట్ల వరకు రుణ బకాయి పడి, చెల్లింపుల్లో విఫలమైన వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ మంగళవారం (జూన్-12) కోర్టు ముందు వాదనలు వినిపించింది. తమ కంపెనీ వ్యాపారం దెబ్బతిని రుణాలు చెల్లించలేకపోవడానికి మోడీ సర్కారు నోట్ల రద్దు అని స్పష్టం చేసింది.

2G స్కామ్‌ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, బ్రెజిల్‌ ప్రభుత్వాల పాత్రను వీడియోకాన్‌ తరఫు న్యాయవాది వినిపించారు. కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను కోరుతూ SBI దాఖలు చేసిన పిటిషన్‌ ను NCLT ముంబై బెంచ్‌ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. గతంలో సమయానికి రుణ చెల్లింపులు చేసిన చరిత్ర కంపెనీకి ఉందని, ప్రస్తుతం చెల్లింపుల్లో విఫలం అవడానికి ఊహించని పరిస్థితులే కారణమని తెలిపారు వీడియోకాన్‌ తరఫు న్యాయవాది.

సరఫరాదారులు ముడి సరుకులను సరఫరా చేయలేకపోయారు. దీంతో ఆ వ్యాపారం గణనీయంగా తగ్గిపోవడంతో మూసేయాల్సి వచ్చింది’’ అని కోర్టుకు తెలిపారు. ఇక, 2012లో సుప్రీంకోర్టు 100కుపైగా 2జీ లైసెన్స్‌లను రద్దు చేసిందని, అందులో వీడియోకాన్‌ లైసెన్స్‌లు 21 వరకు ఉండటంతో భారీగా నష్టపోవాల్సి వచ్చిందని, బ్యాంకులకు చెల్లింపులు చేయలేకపోయినట్టు వివరించారు. బ్రెజిల్‌ పెట్రోలియంతో కలసి జాయింట్‌ వెంచర్‌ కింద ఆయిల్, గ్యాస్‌ వ్యాపార నిర్వహణకు అక్కడి ప్రభుత్వ అనుమతిలో జాప్యం చేయడంతో నష్టాలు వచ్చినట్టు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates