మిగతా వాళ్లు పోటీకి వస్తారనా : నీరవ్ కి అప్పులిచ్చిన రూల్స్ అడగొద్దు

nirav13 వేల కోట్ల PNB స్కామ్ లో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోడీకి ఏ విధంగా రుణాలు ఇచ్చారో చెప్పేందుకు నిరాకరించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. రుణాలు ఇచ్చేందుకు అనుసరించిన ప్రక్రియ, ఎన్ని సార్లు నీరవ్‌ తో సమావేశమయ్యారు తదితర వివరాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలంటూ ముంబయికి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్‌ గల్‌గలి సమాచార హక్కు చట్టం ద్వారా కోరాడు. అయితే నీరవ్ కేసు ప్రస్తుతం CBI విచారణలో ఉండటంతో దీనికి సంబంధించిన ఏ విధమైన వివరాలను వెల్లడించబోమని తెలిపింది. మరోవైపు PNB జారీ చేసిన తప్పుడు ఎల్‌ ఓయూలతో రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నింటికీ బకాయిలు చెల్లించేందుకు PNBకి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ ను భారత్‌ రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates