మిగిలింది ఇదొక్కటే : త్వరలో కొత్త రూ.100 నోటు

నోట్ల మార్పిడి తర్వాత దేశంలో ఏ నోటు ఎప్పుడు మారుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు రూ.100నోటు వంతు వచ్చింది. రూ.100 కొత్త నోట్లను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది RBI. లేత నీలి రంగులో, ప్రస్తుత నోట్‌ సైజ్ తో పోలిస్తే 20 శాతం చిన్నదిగా, తక్కువ బరువుతో ఉండే కొత్త రూ.100 నోటును జూన్‌ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది RBI.

నకిలీ నోట్లు తయారు చేయకుండా, అత్యధిక భద్రతా అంశాలు ఈ నోటులో ఉండనున్నట్లు తెలిపింది. 2016 నవంబరులో రూ.500, 1000 నోట్లు రద్దు చేశాక.. రూ.2వేలు, 500, 200 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తక్కువ విలువ కలిగిన నోట్లను అధికంగా అందుబాటులోకి తేవడంతో పాటు, ఎక్కువ విలువ కలిగిన, పాతనోట్లను క్రమంగా మార్కెట్ నుంచి ఉపసంహరించేందుకు ప్రణాళికలు చేస్తోంది RBI.

Posted in Uncategorized

Latest Updates