మిగులు బడ్జెట్ ఇలా : ఒక్కో బ్యాంక్ ఖాతాలో రూ.14వేలు

singporeమిగులు బడ్జెట్ ఉంటే హంగులు, ఆర్భాటాలు చేసి నిధులను దుర్వినియోగం చేసే ప్రభుత్వాలకు ఇది వింటే కరెంట్ షాక్ కొడుతుందేమో? సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది సింగపూర్ ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని దేశాలకు అయితే మింగుడు పడని విషయం ఇది.

సింగపూర్ దేశంలో ప్రస్తుతం 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో 300 సింగపూర్ డాలర్లు (రూ. 14 వేలు) వేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగత ఆదాయం ఎక్కువ ఉన్నవారికి తక్కువ వేస్తారు. తక్కువ ఆదాయం ఉంటే మాత్రం గరిష్ఠంగా రూ.14వేలు ఇస్తారు. ప్రభుత్వంతో సింగపూర్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరి అకౌంట్ లో ఎందుకు డబ్బులు వేస్తున్నారా  తెలుసా.. మిగులు బడ్జెట్.

అవును.. 2017 లో సింగపూర్ ప్రభుత్వానికి 62వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉంది. మిగులు అంటే.. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిందే కదా.. అందుకే ఆ మొత్తాన్ని తిరిగి ప్రజలకే ఇవ్వాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. మొత్తం 62వేల కోట్లను దేశ జనాభా, వ్యక్తుల ఆదాయానికి అనుగుణంగా లెక్కలేసి మరీ వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. అది కూడా 21 ఏళ్లు నిండిన వారికి.. బ్యాంక్ ఖాతాలోనే ఈ డబ్బు జమ అవుతుంది. గరిష్ఠంగా రూ.14వేలు ప్రభుత్వం తిరిగి ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్ధికమంత్రి హెంగ్ స్వీ కీట్ స్వయంగా ప్రకటించారు. సోమవారం (ఫిబ్రవరి 19) 2018 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన సభలోనే ఈ విషయాన్ని వెల్లడించారు. ఊహించిన దానికంటే ఎక్కువ నగదు ప్రభుత్వానికి చేరింది.. దాన్ని ప్రజలకు అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

సింగపూర్ ప్రభుత్వం నిర్ణయంతో ప్రపంచం మొత్తం ఔరా అని నోరెళ్లబెట్టింది. సోషల్ మీడియాలో అయితే వివపరీతమైన సెటైర్లు వస్తున్నాయి. మా దేశం.. మా రాష్ట్రంలోనూ ఇలా అమలు చేయాలనే డిమాండ్లు ఫన్నీగా వస్తున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates