మిగ్ 29కు కొత్త ముస్తాబు…గాల్లోనే ఇంధనం నింపొచ్చు

భారత సుపీరియర్ యుద్ద విమానం మిగ్ 29 సరికొత్త హంగులతో ముస్తాబైంది. యుద్ద విమానాల కొరతతో సతమవుతున్న దేశ వాయుసేనకు ఇది మరింత శక్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇకపై గాల్లోనే ఇంధనాన్ని నింపేలా ఈ విమానాన్ని ఆధునికీకరించామని, అత్యాధునిక క్షిపణులను ఫైర్ చేసే శక్తిని అందించామని, ఎటునుంచి ఎటైనా దాడి చేసేలా కొత్త హంగులతో తీర్చిదిద్దినట్లు ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఫ్లైట్ లెఫ్టినెంట్ కరణ్ కోహ్లీ తెలిపారు.
గాల్లోనే ఇంధనం నింపడం వల్ల మునుపటి వాటితో పోలిస్తే చాలా దూరం ప్రయాణించొచ్చని, శత్ర విమానాలను నాశనం చేయొచ్చని ఓ అధికారి తెలిపారు. మూడు స్వాడ్రన్లలో వీటినిప్పుడు అందుబాటులోకి తెచ్చారు. అందులో రెండు స్వాడ్రన్లు సరిహద్దుల్లో కీలకమైన అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోనే ఉన్నాయి. పాకిస్ధాన్ కు వంద కిలోమీటర్లు, చైనా సరిహద్దుకు 250 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అదంపూర్. ఒక్కో స్వాడ్రన్ లో 16 నుంచి 18 విమానాలుంటాయి.

Posted in Uncategorized

Latest Updates