మిత్రపక్షాలు ఒప్పుకుంటే ప్రధాని అయ్యేందుకు సిద్ధం: రాహుల్

కూటమి పార్టీలన్నీ ఒప్పుకుంటే… ప్రధాని అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని ఎవరు అవుతారన్నది రెండు దశల నిర్ణయమని… ప్రధాని అంశమనేది రెండో ఆప్షన్ అన్నారు. కూటమి పార్టీలతో ఈ అంశాన్ని చర్చించామని, ముందుగా బీజేపీని ఓడించాలని నిర్ణయించామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాతే ప్రధాని అంశంపై ఏం చేయాలన్న దాని గురించి ఆలోచిస్తామన్నారు రాహుల్.

మీరు ప్రధాని అయ్య అవకాశాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఒకవేళ మిత్రపక్షాలు ఆశిస్తే, తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. ఆలయాలకు, మసీదులకు, గురుద్వారాలకు ఎన్నో ఏళ్ల నుంచి వెళ్తున్నాని…కానీ ఇప్పుడు దాన్ని ప్రతిపక్షాలు ఓ సమస్యగా చూస్తున్నాయన్నారు. తాను ఆలయానికి వెళ్లడం బీజేపీకి నచ్చడం లేదని… నేను గుడికి వెళ్తే వాళ్లకు కోపం వస్తోందన్నారు. విమర్శలను ఎదుర్కొనే విధంగా తయారయ్యానన్నారు. వాటితో డిస్టర్బ్ కావడం లేదన్నారు. నాయకత్వమనేది క్రమంగా రావాలని… ప్రజల నుంచి తాను నేర్చుకుంటున్నానని తెలిపారు. ప్రజలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు రాహుల్.

Posted in Uncategorized

Latest Updates