మినిస్టర్ ఆది సంచలన వ్యాఖ్యలు : చంద్రబాబే వాటా ఇమ్మన్నాడు

ADIఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆది నారాయణరెడ్డి. అవినీతి చేసుకోమని చంద్రబాబే తమకు చెప్పారన్నారు మంత్రి ఆది నారాయణ. అంతేకాకుండా మరో టీడీపీ నేతకు అవినీతిలో వాటాలు ఉన్నట్టు వెల్లడించారు. తాను చేసే అవినీతిలో టీడీపీ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి కూడా అర్ధ రూపాయి భాగం ఉందని చెప్పడం దుమారం రేగుతోంది. స్వయానా సీఎం చంద్రబాబే IAS ఆఫీసర్లని తమతో పాటూ కూర్చోబెట్టి పంచాయతీ చేపించారని తెలిపారు. రామ సుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగినా రామ సుబ్బారెడ్డికి సగం వస్తుందని ఆదినారాయణ రెడ్డి అక్కడున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాళ్లు దాంట్లో ఏది విమర్శించినా తానైతే పట్టించుకోను అన్నారు. మీరెవరూ దయ చేసి విమర్శించకండని… మీకు కావాల్సిన పనులు తనను అడగండి అన్నారు. అవసరమైతే SMS లు పెట్టండన్న ఆయన… తాను మీ ఎమ్మెల్యేని, పక్కకు పోయినప్పుడే మంత్రిని’ అంటూ ఆది నారాయణ రెడ్డి కార్యకర్తలు, నాయకులను ఉద్దేసించి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.

Posted in Uncategorized

Latest Updates